Saturday, February 8, 2025

సెలవుపై యూఎస్‌ఎఐడీ ఉద్యోగులు.. ట్రంప్ ఉత్తర్వులకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యుఎస్‌ఎఐడి) లోని ఉద్యోగులను సెలవుపై పంపిస్తూ అధ్యక్షుడు ట్రంప్ జారీ చేసిన ఆదేశాలకు తాజాగా బ్రేక్ పడింది. అమెరికా లోని ఫెడరల్ న్యాయమూర్తి కార్ల్ నికోల్స్ ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయంతో విదేశాల్లోని యూఎస్‌ఏఐడీ ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అసోసియేషన్, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఉద్యోగులు వాదించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో ట్రంప్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు జడ్జి పేర్కొన్నారు. అంతేకాక, ఇప్పటికే సెలవులో ఉన్న యూఎస్‌ఏఐడీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. అంతకు ముందు యూఎస్‌ఏఐడీని మూసివేయాలి అంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా రాసుకొచ్చారు.

యూఎస్‌ఏఐడీలో 10 వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని సూచిస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా 30 రోజుల్లోగా వారంతా ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆదేశించారు. ఆదేశాలకు ముందు ఈ సహాయ సంస్థను తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని, వాళ్లందరినీ వెళ్లగొట్టేస్తానని, ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు డోజ్ విభాగ సారథి, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా దీనిపై మాట్లాడుతూ యూఎస్‌ఏఐడీ నేరగాళ్ల సంస్థ అని ఆరోపించారు. దాదాపు 120 దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికి ఆ దేశాల అభివృద్ధికీ, భద్రతకు , నిధులు సమకూర్చడానికి యూఎస్‌ఏఐడీను నెలకొల్పారు. ఈ సంస్థ వందల కోట్ల డాలర్లను సహాయంగా అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News