- Advertisement -
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించే ఉద్దేశంతో ఏర్పాటైన కొవాక్స్ కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న 10 కోట్ల ఉచిత డోసులను వాడుకోవాలని సీరం ఇన్‌స్టిట్యూట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఒకవేళ వీటిని ప్రభుత్వం వాడుకోకుంటే ప్రాణరక్షణగా నిలిచే వ్యాక్సిన్లు వృధా అవుతాయని పేర్కొంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కేంద్ర ఆరోగ్యశాఖకు సీరం ఇన్‌ష్టిట్యూట్ లేఖ రాసింది. కొవాక్స్ కింద కరోనా టీకాలను ‘గావి’ (జిఎవిఐ) ప్రపంచ దేశాలకు ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వానికి ఇప్పటికే 14 కోట్ల కొవిషీల్డ్ డోసులను అందించింది. వీటికి అదనంగా మరో 10 కోట్ల డోసులను గావి కేటాయించింది.
- Advertisement -