Friday, December 20, 2024

ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి

- Advertisement -
- Advertisement -

రాయికల్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రులను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని ప్రజలంతా ఆస్పత్రి సేవలను వినియోగించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ కోరారు. రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో మీరు నేను కార్యక్రమం నిర్వహించి సోమవారం ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కొన్నింటిని అక్కడే పరిష్కరించారు. ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఆనంతరం ధర్మాజీపేట గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. కట్కాపూర్ గ్రామంలో పల్లె దవాఖానను పరిశీలించారు. వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

తాట్లవాయి గ్రామంలో రూ.10లక్షలతో సిసి రోడ్లు నిర్మాణపనులకు భూమిపూజ చేసారు. యాదవ సంఘ భవన నిర్మాణ పనులకు రూ.2.80లక్షల మంజూరు పత్రాలను అందజేసారు. హన్‌మాన్ ఆలయ అభివృద్దికి మంజూరు చేసిన రూ. 2లక్షల ప్రోసిడింగ్ పత్రాలను అందించారు. ధర్మాజీపేట గ్రామంలో పర్యటించి రూ.3లక్షల నిధులతో మాల సంఘ భవన నిర్మాణ పనులు, రూ.3లక్షలతో మేదరుల సంఘ భవన నిర్మాణ పనులు, యాదవ సంఘం భవనానిని వెచ్చించిన రూ.2లక్షలతో నిర్మాణ పనులను భూమిపూజ చేసారు.

మాజీ ఎంపిటిసి భూక్య దేశాయి భార్య భారతికి కిడ్ని శస్త్ర చికిత్స చేయించుకోగా ఆమెను పరామర్శించారు. అంతకుముందు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సంధ్యారాణి, జెడ్పిటిసి జాదవ్ ఆశ్విని, పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్, సర్పంచ్‌లు రాగి సాగరిక, ముద్దసాని రాజమౌలి, మారంపెల్లి స్నేహలత, పార్టీ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News