Monday, December 23, 2024

రోడ్ల నిర్మాణంలో ఘన వ్యర్థ పదార్థాల వినియోగం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంలో కర్బనం లేని ఘన వ్యర్థాలను ఉపయోగించాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించి ప్రయోగాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం కావడంతో మంత్రిత్వ శాఖ ఈ యోచన చేస్తోంది. మున్సిపాలిటీల్లో సేకరించే వ్యర్థాల్లో జడ ఘన వ్యర్థపదార్థాలు ప్రధానమైనవి. వీటిని సద్వినియోగం చేసుకోవడానికి మంత్రిత్వ శాఖ రెండు పైలట్ ప్రాజెక్టులను చేపట్టింది. మొదటి పైలట్ ప్రాజెక్టును ఢిల్లీ ఎన్‌సిఆర్ పరిధిలో చేపట్టింది. ఇక రెండో పైలట్ ప్రాజెక్టులో భాగంగా అహ్మదాబాద్ ధోలేరా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో ఈ జడ ఘన వ్యర్థపదార్థాలను ఉపయోగించారు.

అయితే ఈ రెండు ప్రాజెక్టుల్లోను కచ్చితమైన క్వాలిటీ కంట్రోల్‌తో కూడిననిబంధనలను పాటిస్తూ నిర్మాణం చేపట్టారు. దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో తయారయ్యే ఘన వ్యర్థపదార్థాలను డిస్పోజ్ చేయడం పెద్ద సవాలుగా మారిందని, దాదాపు 10 వేల హెక్టార్ల భూమి డంప్ సైట్లలో చిక్కుకు పోయి ఉంది. భూమి లభ్యత పరిమితంగా ఉండడంతో ఈ సైట్లన్నీ చెత్త కొండల్లాగా మారిపోయి పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి.దీంతో ఈ ఘన వ్యర్థ పదార్థాలను సద్వినియోగం చేసే దిశగా రోడ్ల నిర్మాణంలో దీన్ని ఉపయోగించుకోవాలని రోడ్డు రవాణా, హైవేల మంత్వ్రి శాఖ యోచిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News