Friday, December 27, 2024

భిన్నమైన కోణాల్లో శౌర్యని చూస్తారు

- Advertisement -
- Advertisement -

నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్.కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉషా మూల్పూరి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

ఒక తల్లిగా కనెక్ట్ అయ్యా…

కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీ మూవీ కృష్ణ వ్రింద విహారి. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. నాగశౌర్య మొదట కథ విన్నారు. కథ చాలా బావుంది. కరోనా సమయంలో ఈ సినిమాను ప్రారంభించాము.

భిన్నమైన కోణాల్లో శౌర్యని చూస్తారు…

ఈ సినిమాలో ఒక పల్లెటూరి కుర్రాడిగా, బ్రాహ్మిన్ కుర్రాడిగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో శౌర్యని చూస్తారు. శౌర్య కెరీర్‌లో ‘కృష్ణ వ్రింద విహారి’ ఒక బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నాను.

గ్రాండ్ సాంగ్‌కు మంచి స్పందన…

200 మంది డ్యాన్సర్స్‌తో చేసిన ‘ఏముందిరా…’ పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. దర్శకుడు ఆ సందర్భానికి అలాంటి గ్రాండ్ సాంగ్ ఉంటే బావుంటుందని అనుకున్నారు. మంచి మ్యూజిక్ వచ్చింది. అలాగే లిరిక్స్ కూడా అద్భుతంగా కుదిరాయి. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. కెమెరామెన్ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఈ పాటని చిత్రీకరించారు.

అందుకే ఈ టైటిల్…

టాలీవుడ్‌కి హీరోయిన్ల కొరత వుంది. షిర్లీ సెటియా ఆ కొరతని తీరుస్తుందనే నమ్మకం వుంది. ఆమె చాలా మంచి నటి. అద్భుతంగా నటించింది. ఇందులో హీరోయిన్ పేరు వ్రిందా. హీరో పేరు కృష్ణ. అందుకే చిత్రానికి కృష్ణ వ్రిందా విహారి అనే టైటిల్ పెట్టాం.

Usha Mulpuri interview about ‘Krishna Vrinda Vihari’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News