Thursday, January 23, 2025

‘గబ్బర్ సింగ్’ని మించిన ఆల్బమ్ కోసం కసరత్తులు..(వీడియో)

- Advertisement -
- Advertisement -

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టు ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైంది. పది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి.

Also Read: ‘నరకాసుర’ టీజర్ కు భారీ రెస్పాన్స్..

‘గబ్బర్ సింగ్’ విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. చిత్రంలోని పాటలు దశాబ్దం తరువాత కూడా నేటికీ మారుమ్రోగుతూ ప్రేక్షకులు కాలు కదిపేలా చేస్తున్నాయి. అలాంటి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ త్రయం.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో “అరేయ్ సాంబ రాస్కోరా” అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వినిపించింది. ‘గబ్బర్ సింగ్’ని మించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించేందుకు హరీశ్ శంకర్, దేవీ శ్రీ ప్రసాద్ లు కసరత్తులు చేస్తున్నట్లు ఈ వీడియో చేస్తే అర్థమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News