Monday, December 23, 2024

యూనివర్సిటీలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం….

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఉత్కల్ యూనివర్సిటీలో మృతదేహం చెట్టుకు వేలాడుతున్న సంఘటన ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగింది. కలియా అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి క్యాంపస్ పరిసరాల్లో ఉంటున్నాడు. కలియా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి డిన్నర్ చేసిన తరువాత పడుకుంటున్నానని తన రూమ్‌లోకి వెళ్లిపోయాడు. రాత్రి 12 గంటలకు వరకు ఇంటిలోనే ఉన్నాడు. గురువారం ఉదయం అతడు కనిపించకపోవడంతో అతడి కోసం కుటుంబ సభ్యులు వెతికారు.

Also Read: మురికివాడ నుంచి మోడల్‌గా ఎదిగిన చిన్నారి

ఉత్కల్ యూనివర్సిటీలోని జగన్నాథ్ దేవాలయం సమీపంలో చెట్టుకు అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం కలియదని కుటుంబ సభ్యులు గుర్తించి అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహంపైన అక్కడక్కడ కత్తి గాట్లు ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News