Wednesday, January 22, 2025

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందించిన ఎంపిపి

- Advertisement -
- Advertisement -

 

ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఉట్నూర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 5 క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. ఆదివారం జరిగిన రెండవ మొదటి రౌండ్ లో ఫైటర్స్ క్రికెట్ క్లబ్ ఉట్నూర్, రాయల్ క్రికెట్ క్లబ్ శ్యామ్ నాయక్ తాండ జరిగిన మ్యాచ్లో ఫైటర్స్ క్రికెట్ క్లబ్ ఉట్నూర్ నిర్ణీత 16 ఓవర్లలో 127 పరుగులు చేసి 7 వికెట్లు నష్టపోయింది.

అనంతరం బ్యాటింగ్ కి దిగిన రాయల్ క్రికెట్ క్లబ్ శ్యామ్ నాయక్ తాండ 16 ఓవర్స్ లో 125 పరుగు చేసి 6 వికెట్స్ నష్టపోయారు. ఫైటర్స్ క్రికెట్ క్లబ్ ఉట్నూర్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన వినోద్ కి ఉట్నూర్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు పంద్ర జైవంత్ రావు అవార్డును అందజేశారు. యుపిఎల్ నిర్వాహకులు అంజాద్ ఖాన్ , అభిద్, రెహానా, నవీన్ ,వేణు, వంశి , ఫెరోజ్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News