Monday, December 23, 2024

బిజెపి నుంచి అభ్యర్థిని నిలబెడితే పోటీ నుంచి తప్పుకుంటా : ఉత్పల్ పారికర్

- Advertisement -
- Advertisement -

Utpal Parrikar to contest as Independent

న్యూఢిల్లీ : పనాజి నియోజక వర్గం నుంచి బిజెపి నుంచి అభ్యర్థిని నిలబెడితే తాను ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పేర్కొన్నారు. బిజెపి టికెట్ దక్కక పోవడంతో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు పారికర్ సిద్దమయ్యారు. బిజెపిని విడిచిపెట్టడం సంక్లిష్ట నిర్ణయంగా ఉత్పల్ పారికర్ చెప్పారు. రెండు దశాబ్దాలుగా పనాజీ నుంచి పారికర్ తండ్రి మనోహర్ పారికర్ ప్రాతినిధ్యం వహించారు. మనోహర్ పారికర్ మరణంతో పనాజీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన అటనసియో మస్సరటెకు తాజాగా బిజెపి టికెట్ కేటాయించింది. మస్సరటెపై మైనర్ బాలిక పై లైంగిక దాడి సహా అనేక క్రిమినల్ కేసులు నడుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News