Wednesday, January 22, 2025

ఉత్సవం విజయోత్సవం జరుపుకోవాలి : అనిల్ రావిపూడి

- Advertisement -
- Advertisement -

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో అర్జున్ సాయి రచన, దర్శకత్వం వహించిన తెలుగు డ్రామా ‘ఉత్సవం’. హార్న్‌బిల్ పిక్చర్స్‌పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ , నాజర్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోహిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో టీం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిధిగా హాజరైన ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ “ఉత్సవం సినిమా కాన్సెప్ట్ చెప్పినపుడే నాకు బాగా నచ్చింది.

నాటకరంగం, రంగస్థలం బ్యాక్‌డ్రాప్‌లో డైరెక్టర్ అర్జున్ సాయి చాలా బ్యూటీఫుల్ గా స్క్రిప్ట్ చేశారు. నాటకరంగాన్ని నేపధ్యంగా ఎంచుకొని ’ఉత్సవం’ సినిమాని చాలా కష్టపడి చేశారు. ఉత్సవం సినిమా మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడు అర్జున్ సాయి మాట్లాడుతూ “ఆర్ట్ కోసం జీవితాల్ని త్యాగం చేసిన దాదాపు 150 కుటుంబాలు వున్నాయి. వారి అంకిత భావం చూసి ఈ కథని రాశాను. దీనికి బ్యూటీఫుల్ లవ్ స్టొరీ యాడ్ చేశాం. హీరో, హీరోయిన్ పాత్రలు రాసినప్పుడు సాక్షాత్ శివ పార్వతులే దక్ష యజ్ఞం నాటకం వేయడానికి వచ్చారేమో అనిపించింది.

కథనే ఇంత మందిని డ్రైవ్ చేసింది. ఉత్సవం చూసి బయటికి వచ్చినప్పుడు ప్రేక్షకుడి మొహంపై ఓ చిరునవ్వు ఉంటుంది”అని తెలిపారు. నిర్మాత సురేష్ పాటిల్ మాట్లాడుతూ “చాలా మంచి సినిమా ఇది. చాలా గొప్ప నటులు ఈ సినిమాకి పని చేశారు. మ్యూజిక్ అద్భుతంగా వచ్చింది. సినిమా చూసినప్పుడు ఉత్సవంలా ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో దిలీప్ ప్రకాష్, హీరోయిన్ రెజీనా కసాండ్రా, బ్రహ్మానందం, శశిధర్ రెడ్డి, అనూప్ రూబెన్స్, రమణ గోపిశెట్టి, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News