Friday, April 25, 2025

కాళేశ్వరం నిరుపయోగం.. కానీ రికార్డుస్థాయిలో పంటలు: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రాజెక్టుల అంశంలో బిఆర్‌ఎస్ నేతలు సిగ్గుపడాలి అని నీటి పారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంతో అద్భుతం సృష్టిస్తున్నామని రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. ఎన్‌డిఎస్ఎ నివేదిక చూసిన తర్వాతైనా సిగ్గుపడాలి అని పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ నేతలే డిజైన్ చేశారని వాళ్లే నిర్మించారని ఆరోపించారు. మేడిగడ్డ, సుందిళ్ల నిరుపయోగంగా మారాయని అన్నారు. కాళేశ్వరం నిరుపయోగమైనా.. రికార్డుస్థాయిలో పంటలు వచ్చాయని తెలిపారు.

అబద్ధాలను గొప్పగా చెప్పుకొని బతకాలని బిఆర్‌ఎస్ అనుకుంటోందని.. రైతులకు బిఆర్‌ఎస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టుపై అధ్యయనం చేస్తామని.. వచ్చే కేబినెట్ భేటీలో ఎన్‌డిఎస్‌ఎ రిపోర్టుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాళేశ్వరాన్ని.. బిఆర్‌ఎస్ నేతల జేజులు నింపుకోవడానికే కట్టారని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News