Monday, December 23, 2024

అసెంబ్లీలో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్..

- Advertisement -
- Advertisement -

ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా ప్రాజెక్టులు, కెఆరఎంబి సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం తరుపున మంత్రి ఉత్తమ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 10 ఏళ్లలో కృష్ణా నది జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలిపారు. తెలంగాణకు రావాల్సిన వాటాను ఆంధ్రాకు అప్పజెప్పారని తెలిపారు.

కృష్ణా ప్రాజెక్టులను గత ప్రభుత్వం.. కేంద్రానికి అప్పజెప్పిందని.. కానీ, మా ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రాజెక్టులను కెఆర్ఎంబికి అప్పగించమని మంత్రి స్పష్టం చేశారు. కెసిఆర్ పాలనలో ఎపి సర్కార్.. పోతిరెడ్డిపాడు ప్రజెక్టు పరిమితిని పెంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని అక్రమంగా తరలించుకుపోయిందని.. ఆ సమయంలో కెసిఆర్ సర్కార్ కనీసం స్పందించకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News