Thursday, January 16, 2025

కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డుల జారీపై మంత్రివర్గ ఉప సంఘం వేశామని తెలిపారు. దాదాపు 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ఆయన చెప్పారు. కొత్త రేషన్‌కార్డులకు దాదాపు రూ.956 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు తెలిపారు. అలాగే.. ప్రస్తుతం రేషన్ కార్డుదారులకు ఇస్తున్న 6 కిలోలతో పాటు సన్నబియ్యం కూడా ఇస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News