Wednesday, January 22, 2025

పార్టీ మార్పుపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. గత కొంతకాలంగా తనపై సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నారని.. ఇలా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని పేర్కొన్నారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున హుజూర్ నగర్ నుండి తాను, తన భార్య పద్మావతి కోదాడ నుంచి పోటీ చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా పార్టీ మార్పుపై స్పందించారు. సోషల్ మీడియాలో తనపై విష ప్రచారం జరుగుతుందని ఫైర్ అయ్యారు. తనపై కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏడాదిన్నరగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. తన రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీతోనేనని ఈ సందర్భంగా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News