Saturday, February 22, 2025

జగన్ కోసం కృష్ణార్పణం

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పాలనలోనే కృష్ణా జలాల్లో తెలంగాణకు
అన్యాయం ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి కెసిఆర్
సహకరించారు జగన్‌తో దోస్తీ కారణంగానే ఎపి
కృష్ణా జలాలను దోచుకెళ్లినా..కెసిఆర్ నోరు విప్పలేదు
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలను నాశనం
చేశారు ఎస్‌ఎల్‌బిసి పూర్తి చేయాలని అడిగితే
వెటకారంగా మాట్లాడారు ఆరు నెలల్లో టన్నెల్
నిర్మాణాన్ని పూర్తి చేస్తాం కాళేశ్వరం అప్పు రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ తీర్చలేనంత భారంగా మారింది
మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్:బిఆర్‌ఎస్ పాలనలో నీటిపారుదల రంగాన్ని భ్రష్ఠు పట్టించారని, నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో అధికారంలోకి వచ్చి న బిఆర్‌ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో తెలంగాణకు తీ రని అన్యాయం చేశారని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కు మార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించారు. కృష్ణా నది జల కేటాయింపులకు సంబంధించి తెలంగాణకు 299 టీఎంసీ, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీ కేటాయింపులపై కెసి ఆర్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలతో తెలంగాణ కు తీరని అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తోందని వారు చెప్పారు. నీ టి కేటాయింపులు లేకుండా కేంద్రం అనుమతులు లేకుండా వారి అవినీతి పనుల కోసమే బిఆర్‌ఎస్ ప్ర భుత్వం సాగునీటి ప్రాజెక్టులు కట్టిందని ఆరోపించా రు. గురువారం జలసౌధలో మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ లక్ష కోట్లు ఖర్చు చేసి కొత్త గా ఒక్క ఎకరం కూడా సేద్యంలోకి తీసుకు రాలేక పోయారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం రూ.25,500 కోట్లు ఖర్చు చేసి ఏమీ సాధించలేకపోయారని ఎద్దేవచేశారు.

నాడు  ఏపీ సీఎం జగన్‌తో మిలాఖత్ అయ్యి కృష్ణానదీ జలాల తరలింపునకు బీఆర్‌ఎస్ సర్కారు సహకరించిందంటూ నాటి కృష్ణా నీటి వినియోగం గణాంకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వారి అక్రమ చర్యలు ఎండగడుతూ వారి అవినీతిని నిలదీస్తున్నందుకు మాజీ మంత్రి హరీష్‌రావు ప్రభుత్వంపై అసంబద్దమైన ఆరోపణలు చేస్తుండడం సిగ్గుచేటని మంత్రులు వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం సకాలంలో ఎస్.ఎల్.బి.సి, పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు, డిండి వంటి వంటి కృష్ణా బేసిన్ లో ప్రాజెక్ట్ లు పూర్తి చేసి ఉంటే ఏపీ నీటి దోపిడీ జరిగే అవకాశమే ఉండేది కాదన్నారు.

ఉదయ్‌పూర్‌లో సానుకూలత
ఈ నెల 18,19 తేదీలలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో జరిగిన జాతీయ నీటిపారుదల మంత్రుల సదస్సులో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌ను కలసి తెలంగాణలో నీటిపారుదల అంశాలై ఎంతో సానుకూలంగా స్పందించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించేందుకు బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. లక్ష కోట్లకు పైగా అప్పుచేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇది తప్పుడు డిజైన్, నాసిరకం నిర్మాణం మరియు నిర్వహణ లేకపోవడం వల్ల సమస్యలకు గురైందని మంత్రి వెల్లడించారు.

వారు వైఫల్యాన్ని ఒప్పుకోరు
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ‘కాళేశ్వరం హృదయం’గా పేర్కొన్న మేడిగడ్డ బ్యారేజ్ వారి స్వంత పాలనలోనే కూలిపోయిందని, అలాంటి వైఫల్యాన్ని ఒప్పుకోకుండా, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్‌ఎస్ నేతలు ఒకే ఒక స్తంభం కూలిపోయిందని నిర్లజ్జగా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అధిక వడ్డీలతో తెచ్చిన అప్పులు తెలంగాణపై భారీ ఆర్థిక భారంగా మారాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. దేవాదుల, కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయల్ సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, డిండి వంటి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయ్యలేక పోయారో బిఆర్‌ఎస్ నేతలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

త్వరలో నీటి కేటాయింపులు
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం గోదావరి నది జలాల 67 టీఎంసీ కేటాయింపును వేగవంతం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ కోసం 44 టీఎంసీ కేటాయింపుకు చర్చలు జరుగుతున్నాయని, సమ్మక్క సారక్క ప్రాజెక్ట్‌పై ఛత్తీస్‌గఢ్‌తో నో ఒబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) కోసం కార్యదర్శితో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
కెసిఆర్, జగన్ మధ్య అవగాహన
కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మధ్య కృష్ణానదీ జలాల వినియోగంపై రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని మంత్రులు ఆరోపించారు. ఫలితంగా ఎపెక్స్ సమావేశం వాయిదా వేసుకున్న కొన్ని రోజుల తర్వాతే ఆర్‌ఎల్‌ఐఎస్ ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించిందన్నారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో స్వయంగా ప్రకటించిన సంగతిని వారు గుర్తు చేశారు. దీంతో తెలంగాణకు సహజంగా ప్రవహించే 7 టీఎంసీ కృష్ణా నీటిని కోల్పోయింది, కానీ ఆంధ్రప్రదేశ్‌కు శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీ నీటిని తీసుకునేందుకు అనుమతి లభించింది అని వారు వివరించారు.
ఇరవై నెలల్లో ఎస్‌ఎల్‌బిసి పూర్తి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు వచ్చే ఇరవై నెలల్లో పూర్తిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News