- Advertisement -
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ కోసం ప్రత్యేక ప్రకటలేమీ లేవని, నిరుత్సాహపరిచిందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంపతృప్తి వ్యక్తం చేశారు. పేదల వ్యతిరేకంగానూ, కార్పోరేట్‌లకు అనుకూలంగా ఉందని ఆయన అన్నారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి కూడా ప్రస్తావన లేదన్నారు.
పునర్విభజన చట్టాన్ని ఆమెదించి పదేళ్ళు అవుతునా, ఇప్పటి వరకు బిజెపి ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. తెలంగాణకు అవసరమైన నిధులు రాబట్టేలా బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు.
- Advertisement -