Tuesday, November 5, 2024

సిఎం పదవి ముగ్గురు, నలుగురు ఆశించడంలో తప్పు లేదు: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం అయ్యేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంఎల్‌ఎ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని వివరించారు. మొదటి నుంచి తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, తన అభిప్రాయాన్ని కూడా హైకమాండ్‌కు చెప్పానని వివరించారు. మంగళవారం ఉదయం డికె శివ కుమార్‌ను ఢిల్లీలో కలిశానని, తన అభిప్రాయాన్ని చెప్పానన్నారు. తాను కాంగ్రెస్ నుంచి ఏడు సార్లు ఎంఎల్‌ఎగా గెలిచానని, 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. సిఎం పదవి ముగ్గురు, నలుగురు ఆశించడంలో తప్పు లేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ సరైన పద్ధతి పాటిస్తోందని ఉత్తమ్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌కు మంచి స్థానాలు రాలేదని, 70 నుంచి 75 సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని ఆశించామని, కాంగ్రెస్‌లో ఎలాంటి గందరగోళం లేదని, ఫలితాలు వచ్చి 48 గంటలు కూడా కాలేదని, సిఎం అభ్యర్థులు ఖరారు ఆలస్యం కావడం సరికాదన్నారు. ఢిల్లీలో కెసి వేణుగోపాల్‌తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంఎల్‌ఎ బట్టి విక్రమార్క కూడా భేటీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News