Friday, November 15, 2024

వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు మూడేళ్లకే దెబ్బతినడమేంటి?: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మార్టిగేజ్ చేసి రుణాలు తీసుకవస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రత్యేకంగా సమీక్ష చేస్తానని మంత్రి పేర్కొన్నారు. సిడబ్లుసి అనుమతి లేకుండా ప్రాజెక్టులు ఎలా చేపడుతారని మంత్రి ప్రశ్నించారు. నిధులు ఎలా సమీకరించారని అధికారులను మంత్రి అడిగారు. ప్రాజెక్టు పనులపై థర్డ్ పార్టీ చెకింగ్ లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం నిర్మాణానికి సిడబ్లుసి అనుమతి ఉందని అధికారులు వెల్లడించారు. పాత ఆయకట్టును కొత్త ఆయకట్టులో ఎందుకు చూపుతున్నారని మంత్రి ప్రశ్నించడంతో అధికారులు అవాక్కయ్యారు. వర్షాలు వచ్చినప్పుడు నీరు లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఖర్చు పెడుతున్న మొత్తానికి లబ్ధి ఉండేలా బేరీజు వేసుకోవాలని, వందేళ్లు ఉండాల్సిన ప్రాజెక్టు మూడేళ్లకే దెబ్బతినడం ఆందోళనకరమైన విషయమని ఉత్తమ్ మండిపడ్డారు.

మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగడంపై వివరణ ఇవ్వాలని అధికారులను మంత్రి అడిగారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి రూ.4600 కోట్లు ఖర్చు జరిగిందని ఇఎస్‌సి మురళీధర్ రావు తెలిపారు. ఒక పిల్లర్ 1.2 మీటర్ల మేర కుంగడంతో మరో మూడు పిల్లర్లపై ప్రభావం పడిందన్నారు. పిల్లర్లు కుంగిన వెంటనే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశామని, నీరు తొలగించిన తరువాత పిల్లర్లు కుంగడం ఆగిందని మురళీధర్ రావు చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.

మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగటం చాలా తీవ్రమైన అంశం అని, త్వరలో మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శిస్తానని, మేడిగడ్డ నిర్మించిన ఏజెన్సీ, అధికారులు తనతో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎంత ఖర్చు చేశారో లెక్కలు తేలాలన్నారు. ఎంత ఆయకట్టుకు నీరు ఇచ్చేలా నిర్మాణం జరిగిందో చెప్పాలని నిలదీశారు. ఒక్కో ఎకరా సాగుకు అవుతున్న ఖర్చు ఎంతో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News