ఎపి జలదోపిడీపై మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో
సమావేశం ఏర్పాటు సాగర్, శ్రీశైలంలో
టెలీమెట్రీ ఏర్పాటుకు వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : కృష్ణా నదీ జలాల కేటాయింపుల అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబి) చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన శుక్రవారం ప్రత్యేక సమావేశం జరుగనున్నది. ఈ నేపధ్యంలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలించుకుపోతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం మ ధ్యా హ్నం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబి) చైర్మన్ అతుల్ జైన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కేఆర్‌ఎంబి చైర్మన్ అతుల్ జైన్‌కు కృష్ణానదీ జలాల కేటాయింపులు, ఏపీ నీటి వినియోగం, తెలంగాణ నీటి వినియోగాలకు సంబంధించిన గణాంకాలను మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి వివరించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి ఏపీ ప్రభుత్వం చేస్తున్న నీటిచౌర్యం వివరాల ను మంత్రి వెల్లడించారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో 35 చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కో రారు.దీంతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహిం చాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల సంబంధిత అధికారులకు సమాచారం అందించింది.
నేడు కెఆర్‌ఎంబి ప్రత్యేక సమావేశం
- Advertisement -
- Advertisement -
- Advertisement -