Thursday, January 23, 2025

ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఉత్తమ్ కుమార్ తండ్రి పురుషోత్తమ్ రెడ్డి ఆదివారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో పురుషోత్తమ్ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. పురుషోత్తమ్ రెడ్డి పార్థివ దేహానికి మంత్రి సీతక్క నివాళులర్పించడంతో ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. పురుషోత్తమ్ రెడ్డి సేవలను స్మరించుకోవడంతో పాటు ఉత్తమ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News