Sunday, December 22, 2024

ధాన్యం కొనుగోలులో దగా వద్దు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ :నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ధా న్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ధాన్యం కొనుగోలు పై తీసుకోవాల్సిన చర్యల గురించి పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధా న్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చి న్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జి ల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలన్నారు.

ప్రభుత్వం కొన్ని వేల కో ట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని, స న్న రకం ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్ 500 రూపాయల బోనస్ ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయి లో ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ప్యాడీ క్లీన ర్, ఇతర సామాగ్రి వెంటనే యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నా రు. దొడ్డు రకం ధాన్యం సన్న రకం కొనుగోలు కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలని, రైతుకు ఎటువంటి నష్టం రావడానికి వీలు లేదని మంత్రి స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని
రావాలని మంత్రి సూచించారు. జిల్లాలోని రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు కోసం బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని,

వీటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు. రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాలని, జీఓ 27 పై చర్చించాలని, రైస్ మిల్లర్లచే బ్యాంక్ గ్యారంటీ సమర్పిస్తామని అండర్ తీసుకుని ధాన్యం కేటాయింపు చేయవచ్చన్నారు. రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సమర్పించని పక్షంలో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం భద్రపరిచేందుకు అవసరమైన మేర ఇంటర్మీడియట్ గోడౌన్ సన్నద్ధం చేయాలని, ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు ఫోన్ నెంబర్‌తో కూడిన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల్లో చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలన్నారు. పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా బార్డర్ల వద్ద చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జీఓ 27పై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించామని, ముందుగా రైస్ మిల్లర్లు అండర్ సమర్పించిన తర్వాత బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని సమాచారం అందించామన్నారు. జిల్లాలో అవసరమైన మేర ఇంటర్మీడియట్ గోడౌన్లలో స్పేస్ అందుబాటులో ఉందని, రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News