హైదరాబాద్: రేపు గెలుపు ధ్రువపత్రాలను తమ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు తీసుకుంటారని కాంగ్రెస్ నేత, ఎంపి ఉతమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సిఇఒ వికాస్ రాజ్‌ను టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ, అంజన్ కుమార్, పొంగులేటి, మహేశ్ కుమార్ గౌడ్‌లు కలిశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఆర్‌ఒలకు ఆదేశాలు ఇవ్వాలని సిఇఒను కోరామన్నారు. ఎల్లుండి కెసిఆర్ కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారని, కెసిఆర్ కేబినెట్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియడం లేదని, రాజీనామా సమర్పించేందుకు కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉండొచ్చన్నారు. నచ్చిన గుత్తేదార్లకు రూ.6 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రయత్నం చేశారని, అసైన్డ్ భూముల రికార్డులు మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని ఇసిని కోరామన్నారు.
గుత్తేదార్లకు రూ.6000 కోట్లు?: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -