Sunday, January 26, 2025

తెలంగాణకు అన్యాయం చేసిందే బిఆర్‌ఎస్

- Advertisement -
- Advertisement -

ఉద్దేశపూర్వకంగా
ఆంధ్రప్రదేశ్‌కు మేలు
చేసిన చరిత్ర బీఆర్‌ఎస్
నేతలదే బనకచర్లపై
ఇప్పటి వరకు డీపీఆర్
కూడా సిద్ధం కాలేదు
అయినా కేంద్రానికి లేఖ
రాసి అభ్యంతరాలు చెప్పాం
హరీశ్ ఆరోపణలపై మంత్రి
ఉత్తమ్ కౌంటర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజన తదుపరి కృష్ణా, గోదావరి నీటి వాటాలపై తెలంగాణకు తీరని అన్యాయం చేసిందే పదేళ్ళపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గోదావరిపై బనకచర్ల ప్రా జెక్టు అంశంపై మాజీ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, అర్ధరహితం అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. బనకచర్ల ప్రాజెక్టపై ఏపీ ప్రభుత్వం డీపీఆర్ కూడా రూపొందించలేదని, ఇప్పటి వరకు గోదావరి నుంచి ఒక్క చుక్కనీటిని ఎవ్వరూ ఎక్కడికి తీసుకుపోలేదు, దీనిపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అభ్యంత రం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, ఇలాంటి విషయాల్లో మేము అప్రమత్తంగా ఉన్నామని శుక్రవారం రాత్రి సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించా రు. కృష్ణా, గోదావరి నధులపై ఏపీ

తలపెడుతున్న ఆ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అభ్యంతరాలు ఉన్నాయి, రాష్ట్ర విభజన చట్టానికి కూడా అవి వ్యతిరేకం అని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు మేము స్పష్టంగా లేఖ రాశామంటూ లేఖ ప్రతులను మీడియాకు అందజేశారు. కృష్ణా నది జలాల విషయంలో స్పష్టంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికాలంగా తెలంగాణ నీటి హక్కుల కోసం పోరాడుతుందని, జలవివాదాల ట్రైబ్యూనల్‌కురాష్ట్ర మంత్రిగా తాను హాజరయ్యానని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన కేంద్ర ప్రభుత్వ మినిట్స్ వివరాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిర్గతం చేశారు. 2014 జూన్ 2న అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ జూన్ 18,19 2015న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సమావేశానికి ముఖ్యకార్యదర్శి ఎస్‌కె జోషి హాజరయ్యారు. తెలంగాణకు 299టిఎంసీ సరిపోతుంది, ఏపీకి 512టిఎంసీ ఇచ్చే విధంగా అంగీకరించారని తెలిపారు.

తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో 70 శాతం నీరు కేటాయించాలి, కానీ ఏపీకి 70 శాతం ఇవ్వాలని చెప్పింది నాటి సీఎం కేసీఆర్, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులేనని ఆయన చెప్పారు. 2016 సెప్టెంబర్ 21న కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా తెలంగాణకు 299టిఎంసీ సరిపోతుంది, ఏపీకి 512టిఎంసీ ఇవ్వొచ్చని నాడు సీఎం కేసీఆర్, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్‌రావులు హాజరై అంగీకరించారు. రెండో అపెక్స్ కమిటీ మీటింగ్‌లో కూడా ఆనాటి సీఎం కేసీఆర్ అదేరీతిలో అంగీకారం తెలిపారని చెప్పారు.

పోతిరెడ్డిపాడు విషయంలోనూ
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యలేటరీ గతంలో 44 వేల క్యూసెక్‌లు ఉంటే దానిని 92,600 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఉమ్మడి ఏపీలో శ్రీశైలం నుంచి రోజుకు 4.1టిఎంసీ ఉంటే అదికూడా రాష్ట్ర విభజన తర్వాత 9.6 టిఎంసీకి పెరిగింది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్షం కారణంగానే ఇబ్బందులు పడ్డామని తెలిపారు.

కాళేశ్వరంపై క్షమాపణ లేదు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అద్భుతం అంటూ ప్రచారం చేసుకున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే ఇప్పటి వరకు నాటి సీఎం కేసీఆర్, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులలో ఒక్కరూ కూడా క్షమాపణ చెప్పలేదు. దీనిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్దిని చాటుకునేందుకు కాళేశ్వరం కమిషన్ విచారణ జరుపుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News