- Advertisement -
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందుతాయని, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు అర్హులు అందరికి అందజేయలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా అర్హులైన చివరి వ్యక్తి వరకు అందజేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జాబితాల్లో తమ పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కులగణన, సామాజిక ఆర్ధిక సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు జరిగింది. ఇప్పటివరకు ఎవరికైనా కార్డులు రాని పక్షంలో గ్రామ సభలలో మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి సూచించారు. ఎవరు ఇప్పుడు కార్డు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- Advertisement -