Tuesday, April 1, 2025

సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నిరంతర చర్యలు:ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న 8 మంది కార్మికులను రక్షించేందుకు రెస్కూ బృందం నిరంతరం చర్యలు చేపడుతూ పనులను వేగవంతం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి తెలిపారు. బుధవారం ఎస్‌ఎల్‌బిసి క్యాంపు కార్యాలయం దగ్గర పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి, జడ్చర్ల శాసనసభ్యుడు అనిరుధ్ రెడ్డితో కలిసి ప్రతికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్‌ఎల్‌బిసి ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలను రక్షించేందుకు భారతదేశంలోని టన్నెల్ నిష్ణాతులందరినీ రప్పించామ,ఇ, వారి సేవలను వినియోగించుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దేశంలో ఉన్న అత్యాధునిక సదుపాయాలు ఉపయోగించుకుని సహాయక చర్యలు చేపడుతున్నామని అన్నారు. టన్నెల్‌లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆశలు వదులుకోలేదని, వారు ప్రాణాలతో బయటకు తీసుకురావాలని ఆశతో సహాయక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

టన్నెల్‌లోని ప్రమాద ప్రదేశంలో 15 ఫీట్ల ఎత్తు 200 మీటర్ల మేర బురద పేరుకుపోయి ఉండడంతో రెస్కూ సిబ్బందికి ఇబ్బందులు ఏర్పడుతున్నందున సహాయక చర్యలు నెమ్మదించాలని తెలిపారు. టన్నెల్‌లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటికి పంపడం, బురదను తొలగించడం ద్వారా డిబిఎం ముందు భాగం చేరుకోనున్నట్లు తెలిపారు. డిబిఎం చివరి భాగాలను గ్యాస్ కట్టర్లతో, ప్లాస్మా కట్టర్లతో తొలగించనున్నట్లు వివరించారు. ఈ సహాయక చర్యల్లో దేశంలోని మైనింగ్ రెస్కూ సిబ్బంది, ఇండియా బోర్డర్స్ ఆర్గనైజేషన్ సేవలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ప్రమాదం లోపల చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఆధునిక సాంకేతిక పరిఙ్ఞానంపై రెస్కూ టీంలు దృష్టి సారించాయని, సహాయక చర్యల్లో ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రెస్కూ టీంలకు వెసులుబాటు కల్పించిందన్నారు. ఆర్మీ, నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌లకు వెసులుబాటు కల్పించిందన్నారు. ఆర్మీ, నేవీ, ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్,

ర్యాట్ మైన్ సేవలను వినియోగించుకుని పూర్తి ప్రణాళికతో రెండు రోజుల్లో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నట్లు వివరించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయట పడేసేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు రోజులుగా సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతోందని అన్నారు. వ్యవస్థలకు ఇక్కడే కేంద్రీకరింపజేసి పనిచేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ బలగాలు కూడా రంగంలోకి దిగాయని తెలిపారు. తద్వారా సానుకూలంగా పరిమాణాలు మారవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రమాద ప్రదేశంలో నిరంతరం పనులను పర్యవేక్షిస్తున్న జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్‌ను, ఎస్‌పిని మంత్రి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News