Monday, December 23, 2024

నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ?: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తన అంచనా ప్రకారం నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. భార్య పద్మావతితో కలిసి ఉత్తమ్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి గాంధీభవన్‌కు వచ్చారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండలో 12కి 12 సీట్లు గెలిచి క్లీన్‌స్వీప్ చేస్తామన్నారు. దేశంలో పర్ క్యాపిటల్‌లో తెలంగాణ నంబర్ వన్ అని, ఈరోజు లిక్కర్ తీసుకోవడంలో నెంబర్‌వన్‌గా నిలిచిందని ఆయన ఎద్దేవా చేశారు.

సామాజిక వర్గాలయిన మాదిగ, ముదిరాజ్‌లకు ఈ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కలేదని ఆయన ఆరోపించారు. టిక్కెట్ల ప్రకటనలో ముదిరాజ్లు లేవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు, బిసిబంధులు నామమాత్రం పథకాలని, హుజూర్‌నగర్‌లో దళిత బంధు దరఖాస్తుదారుల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు కమీషన్ తీసుకున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. యూనిట్ రాకముందే కమీషన్ వసూలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News