Monday, January 20, 2025

ఏటా 6.50లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదుల పరిహకంగా చేపట్టిన ప్రాధాన్య తా ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారుల ను ఆదేశించారు.ఆదివారం జలసౌధలో మంత్రి ఉత్తమ్ ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాధ్ దాస్, స్పె షల్ సిఎస్ రాహుల్ బొజ్జాతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్లు, ఎస్‌ఈలు, ఈఈలతో వీడియోకాన్ఫరెన్స్‌ద్వారా పనలు పరిస్థితిని సమీక్షించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. రాగల ఐదేళ్లకాలంలో 30లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుందని వెల్లడించారు. ఏటా 6.50లక్షల ఎకరాలు సాగునీరు అందించాల్సివుందని తెలిపారు. ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే అధికారులు నిరంతరం అప్రమత్తతతో ఉంటూ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.

ఈ ఆర్ధిక సంవత్సరం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు కేవలం పనుల నిమిత్తమే రూ.10820కోట్లు కేటాయించిందని స్పష్టత నిచ్చారు. వర్షాకాలం కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తున్నాయని అధికారుల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిచారు.భారీ , మధ్యతరహా ప్రాజెక్టులతోపాటు చిన్ననీటి వనరులు , చెరువులు ,కుంటల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తనతో పాటు నీటిపారుదల శాఖ కార్యదర్శి ప్రతి 15రోజులకు ఒకసారి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సమీక్ష చేస్తామన్నారు. ప్రాజెక్టులో ఉన్న పనలు, భూసేకరణ తదతర క్షేత్ర స్థాయిలో ఉన సమస్యలను గుర్తించి పనులు పూర్తి చేయాలన్నారు. ప్రధాన్యత ప్రాజెక్టులకు నిధులు కొరత రానీయం అని వెల్లడించారు. పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ప్రశాంత్‌పాటిల్ , ఈఎన్సీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News