Saturday, November 2, 2024

యుద్ధప్రాతిపదికన చెరువులు, కాల్వల పునరుద్దరణ

- Advertisement -
- Advertisement -

పూర్తి స్థాయిలో రిజర్వాయర్లు నింపండి
మరమ్మతులకు వారంలో టెండర్లు పిలవాలి
తక్షణం పాలన పరమైన అనుమతులు తీసుకోవాలి
నేటి ఉదయానికి ఆన్ లైన్ లో టెండర్లు అప్ లోడ్ చెయ్యాలి
వరద నష్టం అంచనాలు వెంటనే అందించాలి
రెగ్యులేటరీలు, షట్టర్లు పనిచేస్తున్నాయా లేదా పరిశీలించడం లేదు
మరోసారి పునరావృతం అయితే చర్యలు కఠినంగా ఉంటాయి.
ఈ తరహా సంఘటనలకు సిఇలే బాధ్యత వహించాలి
సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ఈ వర్షాకాలం రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను సామర్దం మేరకు పూర్తి స్థాయిలో నింపాటని, ఇటీవల భారీ వర్షాలకు తెగిపోయిన చెరువుకట్టలు, కేనాల్స్ పునరుద్ధరణకు వారం రోజుల్లో టెండర్లు పిలవాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. చెరువులు, కాలువల పునరుద్ధరణతో పాటు పాక్షికంగా దెబ్బతిన్న చెరువులు,కాలువల మరమ్మతులకు కుడా టెండర్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలన్నారు. వెంటనే పాలనా పరమైన అనుమతులు తీసుకుని శుక్రవారం ఉదయానికి ఆన్ లైన్ లో టెండర్లు అప్ డేట్ చెయ్యాలని ఆయన అధికారులకు సూచించారు. రాష్ట్రంలో తాజాగా సంభవించిన వర్షపు ఉధృతికి జరిగిన నష్టంపై గురువారం రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులతో ఎర్రమంజిల్ కాలనీ జలసౌద లోని నీటిపారుదల శాఖా కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

నీటిపారుదల శాఖా ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇ.యన్.సి లు అనిల్ కుమార్, నాగేందర్ రావు, హరేరాం, శంకర్ నీటిపారుదల శాఖా సలహాదారుడు అదిత్యా దాస్ నాధ్, డిప్యూటీ ఇ.ఎన్.సి కే.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటిపారుదల శాఖా చీఫ్ ఇంజినీర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇంతటి వర్షపు ఉధృతిలోనూ విధుల్లో నిమగ్నమయి పనిచేసిన నీటిపారుదల శాఖా సిబ్బందిని ఆయన అభినందించారు. అయితే అదే సమయంలో తాను స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యటించినపుడు కొన్ని వాస్తవాలు వెలుగు చుశాయన్నారు.

రెగ్యులేటరీలు, షట్టర్లు పనిచేస్తున్నాయా లేదా అన్న పరిశీలన కనిపించలేదన్నారు. తద్వారా విపత్తులు సంభవించినప్పుడు దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఒక దగ్గర రెగ్యులేటరీ జామ్ అయ్యిందన్నారు…మరోచోట షట్లర్ ఎత్తుతుంటే తెగిపోయిందన్నారు. ఈ తరహా సంఘటనలు మరోసారి పునరావృతం అయితే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు . ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే అందుకు సి.ఇ లే బాధ్యత వహించాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News