Friday, November 1, 2024

నాపై అసత్య ప్రచారం ఇంటి దొంగల పనే : ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ తాను పార్టీ మారుతున్నట్లు ఇంటి దొంగలే అసత్య ప్రచా రం చేస్తున్నారని, ఈ దుష్ప్రచారం పార్టీలో ఒక ముఖ్యనేత కుట్రలో గమని ఎంపి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పే ర్కొన్నారు. శనివారం ఉత్తమ్ కుమా ర్ రెడ్డి దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొద్దిరోజులుగా బిఅర్‌ఎస్ పార్టీ లో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్ లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నా రు. ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ప్రచారం చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రె స్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఓ నాయకుడు పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకుప్రయత్నిస్తున్నాడని ఆ యన వ్యాఖ్యానించారు.

ప్ర జల్లో తన ప్రతిష్టను దిగజార్చేందుకే ప్ర చారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పూర్తిగా అబద్ధమని 1994 తర్వాత ఎన్నికల్లో ఓడిపోకుండా 30 ఏళ్లు నిరంతరంగా కాంగ్రెస్ పార్టీకి విధేయతతో పనిచేసి వరుసగా 6 ఎన్నికల్లో గెలిచినందుకు గ ర్విస్తున్నానని పేర్కొన్నారు. నా భార్య పద్మావతి రె డ్డి కోదాడ నుంచి ఎంఎల్‌గా ఉండి 2018 అసెం బ్లీ ఎన్నికల్లో కేవలం 100 ఓట్ల తేడా తో ఓడిపోయారు. కోదాడలో ఉంటూ పిసిసి ఉపాధ్యక్షురాలిగా కాంగ్రెస్ తన శక్తి మేరకు అక్కడి ప్రజల కోసం ఆమె పనిచేస్తున్నారని తెలిపా రు. పరువు నష్టం కలిగించే వార్తలు రాసి మమల్ని లక్ష్యంగా చేసుకోవడం బాధాకరమైన అనుచరుల ను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నాడు. నేను పార్టీలో కొన్ని పరిణామాల పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు కానీ జాతీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి సంబంధించిన విధివిధానాలను అనుసరిస్తాను అని ఆయన చెప్పాడు.

పార్టీ అంతర్గత విషయాల గురించి ఎప్పుడు బయట మాట్లాడను అని ఉత్తమ్ తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమస్యపై పి. చిదంబరం అధికారిక సర్వసభ్య సమావేశంలో తప్ప ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌ను కలవలేదు, మాట్లాడలేదన్నారు. నా ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణలో పనిచేసినందుకు గర్వపడుతున్నానని చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్గా పనిచేశా ఆ తరువాత రాష్ట్రపతి వెంకటరామన్, ప్రెసిడెంట్ ఎన్డీ దగ్గర సీనియర్ అధికారిగా కూడా పనిచేశాను చెప్పారు. యూట్యూబ్ ఛానళ్లు , మీడియా సంస్థలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారనే నిరాధారమైన, తప్పుడు కథనాలను ఖండిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News