Sunday, December 22, 2024

హుజూర్‌నగర్, కోదాడ స్థానాలు మావే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో హుజూర్‌నగర్, కోదాడ స్థానాలు తమవేనని పిసిసి మాజీ ఉపాధ్యక్షుడు, నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆ రెండు చోట్ల 50 వేల మెజార్టీతో గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక కొద్దిరోజుల క్రితం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కోదాడలో కాంగ్రెస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.

30 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు సొంతిల్లు కూడా లేదని, తమకు పిల్లలు కూడా లేరని, కోదాడ, హుజూర్‌నగర్ ప్రజలే తమ పిల్లలుగా భావిస్తున్నామన్నారు. దేశంలోనే అత్యున్నత ఉద్యోగాన్ని వదిలేసి తాను రాజకీయాల్లోకి వచ్చానని గుర్తుచేశారు. పదవిలో వున్నా లేకునా ప్రజల కోసమే పనిచేస్తానన్నారు. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News