మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో బాధ్యులందరిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మా విజ్ఞప్తిపై స్పందించిన ఎన్డిఎస్ఎ.. కొత్త కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు. బిఆర్ఎస్ నేతలు శుక్రవారం మేడిగడ్డ కుంగిన ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లిన క్రమంలో మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ.. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంతో బిఆర్ఎస్ నేతల తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు.
“ప్రాజెక్టుల విషయంతో గత ప్రభుత్వం భారీ తప్పులు చేసింది. కమిషన్ల కోసం రైతుల ప్రయోజనాలను గాలికి వదిలేసింది. ప్రాజెక్టులకు సంబంధించిన కొన్ని రిపోర్టులను ప్రభుత్వం ఇవ్వలేదని ఎన్డీఎస్ఎ చెప్పింది.నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక ఎన్ డిఎస్ఎ ఇవ్వనున్నట్లు తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై సత్వర విచారణ జరగాలి. శనివారం ఢిల్లీలో మేడిగడ్డపై పలువురు నిపుణులు, అధికారులను కలుస్తాం. రెండో మూడు రోజుల్లో విజులెన్స్ కమిటీ నివేదిక వస్తుంది. రిపోర్టుపై న్యాయసలహా తీసుకుని కేసులు వేస్తాం” అని చెప్పారు.