Thursday, April 10, 2025

1.5 టిఎంసిల కెపాసిటితో గంధమల్ల ప్రాజెక్టు: మంత్రి ఉత్తమ్‌

- Advertisement -
- Advertisement -

1.5 టీఎంసీల నీరు నిలిపేలా గంధమల్ల ప్రాజెక్టును నిర్మిస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చెప్పారు. గంధమల్లపై ఇప్పటివరకు రూపాయి పని కూడా జరగలేదని.. భూసేకరణపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసన మండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. గంధమల్ల రిజర్వాయర్‌ అంశం సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉందని.. రిజర్వాయర్‌ పూర్తయితే ఆలేరు ప్రాంతానికి లాభం జరుగుతుందన్నారు. ఈ బడ్జెట్‌లో గంధమల్ల రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని మల్లన్న కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్ర ఉత్తమ్.. గంధమల్ల గ్రామస్థులు ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. స్థానికులు భూసేకరణకు సహకరిస్తే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 4.28 టీఎంసీల కెపాసిటీ కావాలంటే గంధమల్ల మునిగిపోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News