ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో కేరీర్‌ను ప్రారంభించిన ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోనూ కెప్టెన్‌గా ఉన్నారు. ఈసారి కూడా హుజుర్‌నగర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. బిఎస్‌సిలో గ్రాడ్యుయేషన్ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 1982 నుంచి 1991 వరకు ఐఎఎఫ్‌లో పని చేశారు. 1999, 2004లో కోదాడ నుంచి ఎంఎల్‌ఎగా గెలుపొందారు.
2009, 2014, 2018, 2023లో హుజుర్‌నగర్ నుంచి విజయం సాధించారు. 2019లో హుజుర్ నగర్ ఎంఎల్‌ఎ పదవికి రాజీనామా చేసి 2019లో నల్గొండ ఎంపిగా గెలిచారు. 2015-2021 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. మిగ్ 21, మిగ్ 23ను ఫ్రంట్ లైన్ ఫైటర్ స్క్వాడ్రన్ గా ఉన్నారు. రాష్ట్రపతి భవన్‌లో భద్రత , ప్రోటోకాల్, పరిపాలన, రాష్ట్రపతి విదేశీ పర్యటనల కంట్రోలర్‌గా కూడా పని చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆరుసార్లు ఎంఎల్‌ఎగా ఎన్నికయ్యారు.