Wednesday, January 22, 2025

నీటివాటాల్లో తెలంగాణాకు అన్యాయం చేసిందే బిఆర్ఎస్: అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటివాటాల్లో తెలంగాణాకు న్యాయం జరగలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ అన్నారు.  అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నీటి పారుదల ప్రాజెక్టులపై ఆయన మాట్లాడుతున్నారు. కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2004నుంచి 2014 వరకూ శ్రీశైలం ప్రాజెక్టుకు 10,665 టీఎంసీల నీళ్లు వచ్చాయనీ, ఇందులో 727 టీఎంసీలు చట్టవిరుద్ధంగా దారి మళ్లాయనీ మంత్రి చెప్పారు.  రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పదేళ్లలో శ్రీశైలానికి 8,999 టీఎంసీల నీళ్లు వస్తే, అందులో 1200 టీఎంసీలు దారిమళ్ళాయన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పదేళ్లలో 50 శాతం నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయాయన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ అవార్డు కింద 811 టిఎంసీల నీళ్లు ఉన్నాయని, వాటిలో 60నుంచి 70 శాతం నీళ్లను క్లెయిమ్ చేయాల్సి ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం 299 టిఎంసీలు మాత్రమే క్లెయిమ్ చేసిందని వివరించారు. చేసిందంతా చేసి, నల్గొండలో సభ పెడితే ఏం లాభమని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల అప్పగింతపై కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కెఆర్ఎఁబీకి ప్రాజెక్టులను అప్పగించబోమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News