Monday, December 23, 2024

వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలి: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లో బకాయిలన్నీ క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఎం కెసిఆర్‌కు కాంగ్రెస్ ఎంపి ఉత్తమ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పంట రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలని ఆయన కోరారు. పంట రుణాల కోసం రూ.20 వేలు కోట్లు, మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 4 వేల కోట్లు, విద్యార్థులకు రూ.3 వేల కోట్లు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు భారీ బకాయిలు విడుదల కాకపోవడంతో అనేక ముఖ్యమైన పథకాలు నిర్వీర్యం అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పెండింగ్‌లో ఉన్న అన్ని బకాయిలను విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని కేటాయింపులు చేయాలని ఆయన పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న హామీ పెండింగ్‌లో ఉందని తెలిపారు. 2023- -~24 బడ్జెట్‌లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, పంట రుణమాఫీ, మహిళా స్వయం సహాయక సంఘాల బకాయిలను సింగిల్ టేక్‌లో విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులను నిర్ధారించాలని లేఖలో ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News