Monday, December 23, 2024

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీలో ఉత్తమ్‌కు చోటు

- Advertisement -
- Advertisement -

నాలుగు దశాబ్ధాల తరువాత తెలుగు వారికి గుర్తింపు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి చోటు దక్కింది. నాలుగు దశాబ్ధాలుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు ఈ కమిటీలో చోటు దక్కలేదని మొదటిసారిగా ఆయన్ను కాంగ్రెస్ అధిష్టానం గుర్తించిందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ సభ్యులకు కేటాయించే అసెంబ్లీ, పార్లమెంట్ తదితర టికెట్‌లను ఫైనల్ చేస్తాయి. ఇలాంటి కమిటీలో తనకు స్థానం కల్పించడంపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కమిటీలో హేమాహేమీలు ఉన్నారు. ఈ కమిటీలో మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, అంబికాసోనీ, ఆధిర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టిఎస్ సింగ్ డియో, కెజే గిగోర్, ప్రీతంసింగ్, మహ్మద్ జావేద్, అమీ యజ్ఞిక్, పిఎల్ పునియా, ఓంకార్ మర్‌కం, కెసి వేణుగోపాల్‌లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News