Thursday, December 19, 2024

ప్రేమ పెళ్లి… గర్భవతి గొంతు కోసి హత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రేమించి పెళ్లి చేసుకొని ఐదు నెలల గర్భవతి గొంతు కోసి భర్త హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నైనా, ప్రవీణ్ కాలేజీలో మంచి స్నేహితులుగా ఉండడంతో ప్రేమించుకున్నారు. ఎనిమిది నెలల క్రితం హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. నైనా తల్లి పేరుపై నిక్లేశ్ దేవీపై మూడు ప్లాట్లు ఉన్నాయి. ఒక ప్లాట్ తీసుకరావాలని నైనాను ప్రవీణ్ పలుమార్లు బలవంత పెట్టాడు.

Also Read: విక్రమ్‌గౌడ్‌కు లేఖ రాసిన జెపి నడ్డా…

దీంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గతంలో నైనాను ప్రవీణ్ చంపడానికి పలుమార్లు ప్రయత్నించినప్పటికి ఆమె తప్పించుకుందని నైనా తల్లి తెలిపింది. ప్లాట్ల విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరగడంతో భార్య గొంతు నులిమి అనంతరం కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఇంటికెళ్లే సరకి ఆమె రక్తపు మడుగులో కనిపించింది. ప్రవీణ్ పిఎస్‌కు వచ్చి మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించామని ఇన్స్‌పెక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News