Sunday, December 22, 2024

భార్య సహాయంతో డ్యాన్సర్ పై అత్యాచారం చేసిన భర్త

- Advertisement -
- Advertisement -

లక్నో: ఈవెంట్ మేనేజర్ తన భార్య సహాయంతో డ్యాన్సర్ ను ఇంట్లో బంధించి ఆమెపై భర్త పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఆగ్రా లో వినయ్ గుప్తా అనే వ్యక్తి ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఘజియాబాద్ కు చెందిన ఓ యువతి డ్యాన్స్ చేసూ జీవనం సాగిస్తోంది. ఆగ్రాలో ఓ ఈవెంట్ కు డ్యాన్సర్ కావాలని యువతిని సంప్రదించాడు.

అక్టోబర్ 8న యువతి ఆగ్రాకు రాగానే తన ఇంటికి తీసుకెళ్లాడు. మత్తు మందు కలిపిన టీ ఇవ్వడంతో ఆమె ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెకు స్ఫృహ వచ్చేసరికి చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నాయి. అక్కడి నుంచి యువతి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించింది. వినయ్ కుమార్ తనను మూడు రోజులు బంధించి తనపై అత్యాచారం చేశాడని పిఎస్ లో ఫిర్యాదు చేసింది. తనని వ్యభిచార వృత్తిలో దింపేందుకు బలవంతం చేశాడని పోలీసులకు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News