Saturday, December 21, 2024

చితిలో కాలిపోతున్న కూతురు మృతదేహాన్ని బయటకు తీసి….

- Advertisement -
- Advertisement -

లక్నో: చితిలో కాలిపోతున్న కూతురు మృతదేహాన్ని బయటకు తీసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. లోకేష్ అనే యువకుడు సంవత్సరం క్రితం శివానిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అదనపు కటం తీసుకరావాలని అత్తమామ, భర్త వేధించారు. అకస్మాత్తుగా శివాని మృతి చెందడంతో వారి తల్లిదండ్రులకు అత్తింటి వారు సమాచారం ఇచ్చారు. వెంటనే తల్లిదండ్రులు కూతురు ఇంటికి చేరుకునేసరికి హడావుడి అంత్యక్రియలు జరిపిస్తున్నారు. చితిలో కాలుతున్న మృతదేహాన్ని బయటకు తీసిని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివాని అత్తమామలను పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News