Friday, December 20, 2024

మార్కెట్‌లో దొరికిన ప్రేమజంట… అమ్మాయిని చితకబాది… హత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: వేరే కులానికి చెందిన వ్యక్తితో ప్రేమాయణం నడిపిస్తోందని కూతురిని కుటుంబ సభ్యులు కొట్టి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమేథీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అమేథీలోని ఓ గ్రామంలో నియమత్ ఉల్లాకు అఫ్రీన్ అనే కూతురు, హైదర్ అలీ అనే కుమారుడు ఉన్నాడు. అఫ్రీన్ ఇతర కులానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడింది. తన ప్రియుడితో కలిసి అఫ్రీన్ మార్కెట్‌లో తిరుగుతుండగా ఆమె తండ్రి, సోదరుడు గమనించాడు. అక్కడే ఆమెను పట్టుకొని చితకబాది ఇంటికి తీసుకెళ్లారు. బలమైన దెబ్బలు తాకడంతో ఇంటికెళ్లిన తరువాత అఫ్రీన్ మృతి చెందింది. మార్కెట్‌లో ఆమెను కొడుతుండగా కొందరు వీడియోలు తీసి ట్విట్టర్‌లో వైరల్ చేశారు. అనారోగ్య సమస్యలతో తన కూతురు చనిపోయిందని ఇరుగుపొరుగు వారిని నమ్మించి అంత్యక్రియలు జరిపించారు. వీడియో ట్విట్టర్‌లో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు. గుంతలో నుంచి మృతదేహాన్ని తీసి శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితులపై ఐపిసి 304 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: వివేక్ అగ్నిహోత్రి ఆగ్రహం!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News