- Advertisement -
లక్నో : గడచిన అనేక అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మహిళా ప్రాతినిధ్యం అంతంత మాత్రం గానే ఉంది. 6.98 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నప్పటికీ, గడచిన నాలుగు అసెంబ్లీల్లో వీరి సంఖ్య మాత్రం పెద్దగా లేదు. 2002 లో అన్ని పార్టీల తరఫున మహిళా అభ్యర్థులు 184 మంది పోటీలో నిలవగా, కేవలం 31 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2007 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి 154 మంది అభ్యర్థులు బరిలో నిలిచినా కేవలం 25 మంది మాత్రమే గెలుపొందారు. 2012 నాటికి 224 మంది అభ్యర్థుల్లో 43 మంది గెలిచారు. ఇందులో ఎస్పీ తరఫున 21 మంది, బీజేపీ తరఫున 8 మంది గెలిచిన వారిలో ఉన్నారు. ఇక గడచిన 2017 ఎన్నికల్లో 151 మంది మహిళా అభ్యర్థుల్లో 42 మంది మాత్రమే గెలిచినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో బిజెపి తరఫున 36 మంది ఉన్నారు.
- Advertisement -