Friday, November 22, 2024

నాలుగో దశ బరిలో 27 శాతం మంది కళంకితులే

- Advertisement -
- Advertisement -
Uttar Pradesh Assembly polls 2022
రేపు యూపీ ఎన్నికల పోలింగ్

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ నాలుగోదశ ఎన్నికల పోలింగ్ ఈనెల 23 న జరగనున్నది. 624 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు రంగంలో ఉన్నాయి. బందా, ఫతేపూర్, హర్ధోయ్,లఖింపూర్ ఖేర్, లక్నో, రాయ్‌బరేలీ, సీతాపూర్, పిలిభిత్, ఉన్నావ్‌లో పోలింగ్ జరుగుతుంది. ఇందులో రాయ్‌బరేలీ కాంగ్రెస్ కంచుకోట కాగా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇక్కడ నుంచని ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగోదశ ఎన్నికల్లో 167 మంది (27 శాతం) అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 129 మందిపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కళంకితులకు ఎక్కువ సీట్లు ఇచ్చిన జాబితాలో కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు తొలివరుసలో ఉన్నాయి. 53 శాతం మంది చొప్పున రెండు పార్టీలు కళంకిత అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాయి. ఆ తరువాత స్థానంలో బీఎస్పీ 44 శాతం మంది అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. బీజేపీ 40 శాతంతో నాలుగో స్థానంలో, 24 శాతంతో ఆమ్ ఆద్మీ ఐదోస్థానంలో నిలిచాయి.

తీవ్ర నేరారోపణలు

అభ్యర్థుల్లో తొమ్మిది మంది మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు అభ్యర్థులు మహిళలపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు అశోక్‌కుమార్ రాయ్‌బరేలీ లోని హర్‌చందర్ పూర్‌స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో అభ్యర్థి సీతాపూర్ లోని సేవాతాస్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి మహేంద్రకుమార్ సింగ్ పోటీలో ఉన్నారు. ఐదుగురు అభ్యర్థులు తమపై హత్య కేసు ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

14 మందిపై హత్యాయత్నం ఆరోపణలు

14 మంది అభ్యర్థులు హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 99లో 29 అంటే 49 శాతం సీట్లు రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు నేర నేపథ్యం ఉన్నవారే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News