Monday, December 23, 2024

అన్న మృతి… వదినను పెళ్లి చేసుకున్న మరిది… కాల్చి చంపిన సోదరులు

- Advertisement -
- Advertisement -

లక్నో: అన్న మృతి చెందడంతో వదినను మరిది పెళ్లి చేసుకున్నాడు. దీంతో అతడిని సోదరులు తుపాకీతో కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బాగ్‌పత్ గ్రామంలో ఈశ్వర్ అనే వ్యక్తి తను నలుగురు కుమారులు సుఖ్‌వీర్, ఓంవీర్, ఉదయ్‌వీర్, యశ్‌వీర్‌లతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. గత సంవత్సరం సుఖ్‌వీర్ దుర్మరణం చెందడంతో అతడి భార్య రితూ వితంతువుగా ఉంది. సోదరుడు యశ్‌వీర్ రితూను పెళ్లి చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.

యశ్‌వీర్ ఢిల్లీలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇద్దరు సోదరులు తల్లితో గొడవ పెట్టుకుంటున్నారు. అదే సమయంలో యశ్‌వీర్ రావడంతో గొడవ తారాస్థాయికి చేరుకుంది. కోపంతో రగిలిపోయిన యశ్‌వీర్‌పై సోదరులు కాల్పులు జరపడడంతో వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News