Monday, December 23, 2024

బాలీవుడ్ సినిమాలను వీక్షించి… మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కోసి… భార్య తలను సరయు నదిలో పడేశాడు

- Advertisement -
- Advertisement -

లక్నో: డబ్బుల విషయంలో గొడవ జరగడంతో భార్యను చంపి అనంతరం ముక్కలు ముక్కలు రంపంతో కోసి, శరీర భాగాలను వివిధ ప్రదేశాలలో పడేసిన అనంతరం తల, చేతులను సరయు నదిలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బలరామ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాణి బజార్‌లో శంకర్ దయాల్ గుప్తా(45), నీతూ పాండే(41) అనే దంపతులు నివసిస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి డబ్బుల విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆగస్టు 1 దంపతుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో నీతూను భర్త చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఎలక్ట్రిక్ రంపంతో ముక్కలు ముక్కలుగా కోశాడు. శరీర భాగాలను రెండు బ్యాగ్‌లలో ప్యాక్ చేసుకొని అజబ్ నగర్ గ్రామ శివారులోని చెట్ల పొదలలో పడేశాడు. తల, చేతులను సరయు నదిలో పడేశాడు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 500 మంది అదృశ్యం కావడంతో 300 సిసి కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఓ వ్యక్తి తన స్కూటర్‌పై రెండు బ్యాగ్‌లను తీసుకొని వెళ్తుండడం చూసి వాహనం ఆధారంగా శంకర్ ఇంటికి వెళ్లారు. అతడు ఇంట్లో లేకపోవడంతో ఫోన్ నంబర్ ఆధారంగా లక్నోలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. సాక్ష్యాలు లేకుండా ఉండేందుకు భార్య ఫోన్‌తో పాటు మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశానని ఒప్పుకున్నాడు. బాలీవుడ్ సినిమాలు చూసి ఈ హత్యకు ప్లాన్ చేశానని వివరణ ఇచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News