Sunday, January 19, 2025

కూతురు గొంతు నులిమి… నోట్లో యాసిడ్ పోసి…. రోడ్డు పక్కన పడేశారు..

- Advertisement -
- Advertisement -

లక్నో: రోజు రోజుకు దేశంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. తన కులం కంటే తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కన్న బిడ్డలను చంపుతున్న చూస్తూనే ఉన్నాం. ఓ యువతి పక్కింటి యువకుడితో ప్రేమలో పడింది. సదరు యువకుడితో పెళ్లి చేయాలని యువతి అడగడంతో ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే మరో యువకుడితో యువతి పెళ్లి చేశారు. తాను ఇష్టపడిన యువకుడితోనే ఉంటానని చెప్పడంతో ఆమెపై హత్యాయత్నం చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..  దాదా గ్రామంలో తోతారామ్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. అతడికి 25 ఏళ్ల వయసు కలిగిన మున్ని దేవీ అనే కూతురు ఉంది.

Also Read: విమానంలో హస్తప్రయోగం…. ర్యాపర్ అరెస్టు

ఆమె పక్కింటి యువకుడితో ప్రేమలో పడింది. అతడిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో వెంటనే ఆమెకు మరో యువకుడితో పెళ్లి చేశారు. పక్కింటి వ్యక్తితోనే కలిసి ఉంటానని చెప్పడంతో తండ్రి తన అల్లుడు దినేష్ కుమార్‌తో కలిసి ఢిల్లీ నుంచి లక్నోకు వెళ్లే జాతీయ రహదారిపైకి ఆమెను తీసుకెళ్లాడు. కూతురు గొంతు నులిమి అనంతరం ఇద్దరు కలిసి ఆమె నోట్లో, శరీరంపై యాసిడ్ పోసి చనిపోయిందనుకొని వెళ్లిపోయారు. జాతీయ రహదారి పక్కన యువతి అపస్మారక స్థితిలో నగ్నంగా కనిపించడంతో పోలీసులకు వాహనదారులు సమాచారం ఇచ్చారు.

వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. తోతారమ్‌కు పోలీసులు ఫోన్ చేసి కూతురు తమ వద్దని చెప్పడంతో తన అల్లుడు వద్దని బుకాయించాడు. ఫోటోలు, కుటుంబంతో కలిసి భోజనం చేసిన ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని చెప్పడంతో ఆమె తండ్రి కంగుతిన్నాడు. తోతారామ్‌తో అతడికి సహకరించిన కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News