Wednesday, January 22, 2025

అందుకే అల్లుడిని చంపిన అత్తమామ

- Advertisement -
- Advertisement -

లక్నో: అత్త మామను అల్లుడు వ్యక్తిగతంగా కించపరచడంతో అతడిని వారు చంపేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దీపక్ అనే వ్యక్తి తన దగ్గర బంధువులు అత్త మామలతో గొడవకు దిగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో వారిని వ్యక్తిగతంగా కించపరిచాడు. అతడి దూషణలతో తమ పరువు పోవడంతో అత్తమామలు అల్లుడిని చంపాలని నిర్ణయం తీసుకున్నారు. దీపక్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతడి ఇంటికి వెళ్లి రాడ్‌తో తలపై పలుమార్లు బాదారు.

చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత దంపతులు అక్కడి నుంచి పారిపోయారు. కుటుంబ సభ్యులు అతడి రూమ్‌కు వచ్చేసరికి రక్తపు మడుగులో అచేతనంగా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇంటి బయట సిసి కెమెరాలు ఉండడంతో దంపతులు హత్య చేశారని అనుమానాలు రావడంతో వారిని 30 గంటలలోపు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేశామని ఒప్పుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News