Saturday, December 21, 2024

తల్లితో అక్రమ సంబంధం: కుమారుడిని చంపిన తండ్రి

- Advertisement -
- Advertisement -

 

బిజ్నోర్: తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఒక తండ్రి కన్నకొడుకునే కడతేర్చాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు షాహిద్ అహ్మద్ మార్చి 5వ తేదీన తన 22 ఏళ్ల కుమారుడు మొహమ్మద్ గుల్ఫామ్‌ను కత్తితో పొడిచి హతమార్చాడు. షాహిద్ భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఐపిసి సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. కుమారుడిని హత్య చేసి పరారైన షాహిద్‌ను పోలీసులు ఎట్టకేలకు ఇటీవల అరెస్టు చేశారు.

పోలీసుల ఇంటరాగేషన్‌లో నేరాన్ని అంగీకరించిన షాహిద్ కొన్ని దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించాడు. తన కుమారుడికి, తన భార్యకు మధ్య అక్రమ సంబంధం ఉందని, దీనిపై తమ మధ్య అనేకసార్లు గొడవలు జరిగాయని షాహిద్ చెప్పాడు. తనతోనే ఉండాలని తన భార్యను కోరినప్పటికీ ఆమె మాత్రం కుమారుడితోనే ఉంటానని పట్టుపట్టిందని అతను చెప్పాడు. ఈ కారణంగానే తాను తన కుమారుడిని హత్య చేసినట్లు అతను చెప్పాడు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ప్రస్తుతం తమ కస్టడీలోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: విరాట్ తో పెట్టుకుంటే అలా ఉంటుంది….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News