Sunday, December 22, 2024

నర్సుపై రాయితో దాడి.. చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి హత్యాచారం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఒంటరిగా వెళ్తున్న నర్సుపై దాడి చేసి అనంతరం చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బిలాస్ పూర్ పట్టణంలో జరిగింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఓ మహిళ(33) తన 11 ఏళ్ల కూతురుతో కలిసి బిలాస్ పూర్ లో రూమ్ అద్దెకు తీసుకొని నివాసం ఉంటుంది. రుద్రాపూర్ లోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. జులై 30న విధులు ముగించుకొని ఇంటికి బయలు దేరింది. ఆ రోజు రాత్రి వరకు ఆమె ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆగస్టు 7న ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమెపై హత్యాచారం జరిగిందని శవ పరీక్షలో తేలింది.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఆమె ఫోన్ సిగ్నల్స్ రాజస్థాన్ ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు రాజస్థాన్ కు వెళ్లి నిందితుడు ధర్మేంద్రను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు.  నర్సు నివసిస్తున్న ఇంటికి సమీపంలో ధర్మేంద ఆమె తలపై రాయితో దాడి చేశాడు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి లాక్కెళ్లి నర్సుపై అత్యాచారం చేసి చంపేశాడు. ఆమె వద్ద నగదు, మొబైల్ ఫోన్, నగలు, డబ్బులతో పారిపోయినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో జూనియర్ వైద్యురాలుపై సామూహిక హత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News