న్యూఢిల్లీ: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం సాయంత్రం తన మంత్రిమండలిని(క్యాబినెట్) విస్తరించబోతున్నారు. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా కేవలం కొన్ని నెలలే ఉన్న ఈ తరుణంలో ఆయన మంత్రిమండలిని విస్తరించబోవడం గమనార్హం. కొత్త మంత్రుల పదవీ ప్రమాణస్వీకారోత్సవం ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్భవన్లోనిగాంధీ ఆడిటోరియంలో జరుగనుంది. ఇదిలా ఉండగా ఎంత మంది మంత్రులను క్యాబినెట్లోకి తీసుకుంటారనే విషయంలో అధికారులు నోరు మెదపడం లేదు.
కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి జంప్ అయిన బ్రాహ్మణ నాయకుడు జితిన్ ప్రసాద, నిరల్ ఇండియన్ శోషిత్ హమార ఆమ్దళ్(నిషద్) పార్టీకి చెందిన సంజయ్ నిషద్ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీచేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తర్ప్రదేశ్ క్యాబినెట్లో 53 మంది మంత్రులు ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగ పరిమితి ప్రకారం మరో ఏడుగురిని మంత్రిమండలిలోకి తీసుకుని విస్తరిస్తారని తెలుస్తోంది.
“యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోనే బిజెపి ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో పోటీచేయనుందని కేంద్రనాయకత్వం ఇప్పటికే స్పష్టంచేసింది” అన ఉత్తర్ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ పిటిఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో తెలిపారు.
నేడు 5.30కు ఉత్తర్ప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -