Saturday, November 23, 2024

ప్రధాని మోడీని కలిసిన యుపి సిఎం యోగి

- Advertisement -
- Advertisement -

Uttar Pradesh CM Yogi Adityanath meets PM Modi

 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో యుపి సిఎం యోగి అదిత్యనాథ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. యుపి ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకత్వ మార్పుపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో యుపి మంత్రివర్గంలో కూడా మార్పులు జరిగే అవకాశముంది. పలు ఊహాగానాల నేపథ్యంలో ప్రధానితో యోగి సమావేశానికి ప్రాధన్యత సంతరించుకుంది. రెండ్రోజుల పర్యటన కోసం యుపి సిఎం గురువారం ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలోనే నిన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022 లో జరగనున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 403 మంది సభ్యుల ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన పార్టీలలో బిజెపికి 309 మంది శాసనసభ్యులు, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) 49, బహుజన్ సమల్ పార్టీ (బిఎస్పి) 18, కాంగ్రెస్ 7 మంది ఉన్నారు.

Uttar Pradesh CM Yogi Adityanath meets PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News